
ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కూతురు, హాస్య నటి ఇంద్రజ (Indraja Shankar) ఈ ఏడాది ప్రారంభంలో తల్లిగా ప్రమోషన్ పొందింది. 2024 మార్చిలో తన స్నేహితుడు, డైరెక్టర్ కార్తీక్‌తో ఇంద్రజ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే! అదే ఏడాది ఆగస్టులో గర్భం దాల్చానంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు ఏడో నెలలో అడుగుపెట్టడంతో నటి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
గర్వంగా భావిస్తున్నా..
నా సంబరాల మూటకు ఆరు నెలలు నిండాయి. ఇప్పుడు ఏడో నెలలోకి వచ్చాడు. ఏడు నెలల క్రితం నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. నీ చిరునవ్వులకు, నీ కౌగిలింతలకు.. ఆఖరికి నాకు అందించిన నిద్రలేని రాత్రులను కూడా నేనెంతో గర్వంగా భావిస్తున్నాను నక్షత్రన్ అని రాసుకొచ్చింది. ఈ మేరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ నుంచి బాబును ఎత్తుకునే క్షణాల వరకు సంబంధించిన ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్‌ను జత చేసింది.
సినిమా
కాగా ఇంద్రజ తండ్రి.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అవడంతో రోబో శంకర్‌గా పాపులర్ అయిపోయాడు. ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రం అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. దాదపు తమిళ స్టార్ హీరోలందరితోనూ పని చేశాడు. ఇంద్రజ విషయానికి వస్తే దళపతి విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్), విశ్వక్‌సేన్ పాగల్, కార్తీ విరుమాన్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ఉంటుంది.
చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్