దేశం పేరు మార్పుపై అమితాబ్‌ ఆసక్తికర ట్వీట్‌ | India vs Bharat Debate: Amitabh Bachchan Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: దేశం పేరు మార్పుపై అమితాబ్‌ ఆసక్తికర ట్వీట్‌

Sep 6 2023 8:57 AM | Updated on Sep 6 2023 9:42 AM

India vs Bharat Debate: Amitabh Bachchan Tweet Goes Viral - Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’గా సంబోధిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలను జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్‌ పంపించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన పేరు మార్పు గురించే మాట్లాడు​కుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ నటుడు, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌  ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశాడు. ‘భారత్‌ మాతాకీ జై’అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు.

అమితాబ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అబితాబ్‌కి మద్దతుగా ట్వీట్‌ చేస్తే.. మరికొంతమంది వ్యతిరేకంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘జయా జీ అంటే మీకు భయం లేదా?’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

(చదవండి: ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క)

ఇక అమితాబ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కీ 2898’చిత్రంలో నటిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దిపికా పదుకొణె నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement