నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు | Income Tax Officials Search In Actor Arya House, Business And Office In Chennai, More Details Inside | Sakshi
Sakshi News home page

నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Jun 19 2025 12:11 PM | Updated on Jun 19 2025 1:04 PM

Income Tax Search In Actor Arya Business Office

కోలీవుడ్‌ నటుడు ఆర్య నివాసం,  వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆక‌స్మిక‌ దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్‌తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.

ఆర్య  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు.  ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్‌ను  గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement