కాస్ట్ లీ కారు కొన్న యువ హీరో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పార్టీ? | Ibrahim Ali Khan Buys BMW X5 Car, Celebrates With Rumoured Girlfriend Palak Tiwari | Sakshi
Sakshi News home page

Ibrahim Ali Khan: ఫస్ట్ మూవీ రిలీజ్‌కి ముందే లగ్జరీ కారు.. ధర ఎంతంటే?

Published Wed, Jun 12 2024 1:16 PM | Last Updated on Wed, Jun 12 2024 1:33 PM

Ibrahim Ali Khan Buys BMW X5 Car, Celebrates With Rumoured Girlfriend Palak Tiwari

రీసెంట్ టైంలో బాలీవుడ్‌లోకి వారసులు వరసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. గతేడాది రిలీజైన ఓ మూవీతో ఖుషీ కపూర్, అగస్త్య నంద, సుహానా ఖాన్ తదితర నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇబ్రహీం అలీ ఖాన్ కూడా త్వరలో చేరబోతున్నాడు. ఇంకా హీరోగా తొలి మూవీ రిలీజ్ కాలేదు. కానీ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఆ కారు ఖరీదుతో పాటు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి)

సైఫ్ అలీ ఖాన్ తొలి భార్యకు కలిగిన సంతానం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. వీళ్లలో సారా ఇప్పటికే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు ఇబ్రహీం హీరోగా లాంచ్ కాబోతున్నాడు. 'సర్జమీన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నటిస్తున్నందుకు గానూ మంచి రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులుతోనే బీఎండబ్ల్యూ ఎక్స్5 అనే లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు టాక్. మార్కెట్‌లో దీని ధర రూ.1.13 కోట్లు అని సమాచారం.

తాజాగా ఈ కారులో బయట కనిపించిన ఇబ్రహీం.. దీన్ని కొన్న సందర్భంగా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ఇతడి రూమర్ గర్ల్‌ఫ్రెండ్, నటి పాలక్ తివారీ కూడా పాల్గొంది. ఇబ్రహీం ఇంటి నుంచి బయటకొస్తూ కనిపించడంతో ఇదే నిజమేనని మాట్లాడుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement