HIT LIST Movie Teaser Released By Star Hero Vijay Sethupathi - Sakshi
Sakshi News home page

HIT LIST Movie: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. టీజర్ రిలీజ్!

Aug 20 2023 12:24 PM | Updated on Aug 20 2023 12:43 PM

HIT LIST Movie Teaser Released By Star Hero Vijay Sethupathi - Sakshi

దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ తన ఆర్కే సెల్యులాయిడ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్‌ లిస్ట్‌'. నటుడు శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  ఈ  చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్‌ వారసుడు విజయ్‌ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్‌ శిష్యులు సూర్య, కార్తికేయన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇ‍ప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను  విజయ్‌ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.  ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. 

(ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్‌ చూశారా?)

పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది.  టీజర్‌ చూస్తే ఇది మంచి యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్‌ రవికుమార్‌ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సముద్ర ఖని, మునీశ్కాంత్‌, నటి సితార, శతి వెంకట్‌, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్‌, రెడిన్‌ కింగ్స్‌ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

(ఇది చదవండి : జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు)

Advertisement
 
Advertisement
Advertisement