
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. నిన్న(ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ 24 గంటలు గడిచేసరికి మాత్రం రాజమౌళి మూవీస్ రికార్డ్స్ దాటిపోయింది. ఇది మాత్రం ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు.
హిట్ సిరీస్ లో తొలి రెండు సినిమాల్ని థ్రిల్లర్స్ గా మలిచారు. కానీ మూడో భాగాన్ని మాత్రం నరుక్కోవడం, రక్తం ఏరులై పారడం అనేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు తమ సినిమాని చూడొద్దని నాని చెప్పడం కూడా సినిమాపై ఓ రకంగా బజ్ పెంచింది.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)
అలా రిలీజైన 24 గంటల్లో హిట్ 3 ట్రైలర్ కి 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్ఆర్ఆర్ (20.45 మిలియన్), కేజీఎఫ్ 2 (19.38 మిలియన్) రికార్డ్స్ దాటేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.
మే 1న థియేటర్లలోకి రాబోతున్న హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. మరి బ్లడ్ బాత్ అనేలా ఉన్న ఈ మూవీ ఫలితం ఏమవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)