Tamannaah Bouncers: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్ల దాడి.. ఇద్దరికి గాయాలు

Heroine Tamannaah Bouncers Attack On Media Representatives  - Sakshi

టాలీవుడ్ బ్యూటీ తమన్నా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. కొందరు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులతో బౌన్సర్లు వాగ్వావాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి.  తాజాగా సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ‍్యాయి. 

(చదవండి: Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్‌’గా తమన్నా..)

 హీరోయిన తమన్నా టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్‌'. ఈ సినిమాలో సౌరభ్‌ శుక్లా, అభిషేక్‌ బజాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఇది కామెడీతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top