Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్‌’గా తమన్నా..

Tamannaah Bubbly Bouncer Movie Release On OTT in September - Sakshi

తమిళసినిమా: అందాల ఆరబోతకు కేరాఫ్‌ అడ్రస్‌ తమన్నా. ఈ మాటను ఎవరైనా చెబుతారు. అయితే తనలో అద్భుతమైన నటి ఉందన్న విషయాన్ని బాహుబలి చిత్రంతో ఈ మిల్కీబ్యూటీ నిరూపించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా నటించిన ఈమె ఇప్పటికీ మోస్ట్‌ బ్యాచిలర్‌ నటిగానే కొనసాగుతున్నారు. అయితే పూజా హెగ్డే, రష్మిక వంటి నటీమణులు దూసుకు రావడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి. అదే విధంగా నయనతార, అనుష్క, త్రిష, తాప్సీ వంటి నటీమణుల తరహాలో తమన్నా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

కాగా తాజాగా ఈమె నటించిన హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్‌. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్‌ మధు బండార్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఒక కోటీశ్వరునికి లేడీ డాన్సర్‌గా నియమితురాలైన యువతి కథ బబ్లీ బౌన్సర్‌. ఇది కామెడీతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో సెప్టంబర్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని తెలిపారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top