అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్! | Heroine Sobhita Dhulipalla Dance Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipalla: అ‍ల్లు అర్జున్‌ సూపర్ హిట్‌ సాంగ్‌.. శోభిత డ్యాన్స్ చూశారా?

Dec 10 2024 5:39 PM | Updated on Dec 10 2024 6:09 PM

Heroine Sobhita Dhulipalla Dance Video Goes Viral In Social Media

ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిపెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ‍ట్విటర్ ద్వారా షేర్ చేశారు.

అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్‌బస్టర్‌ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement