Actor Vishal & Arya Enemy Movie First Single song Released - Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న విశాల్‌, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్‌ సింగిల్‌

Aug 21 2021 2:38 PM | Updated on Aug 21 2021 3:32 PM

Hero Vishal And Arya Enemy Movie First Song Release - Sakshi

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ అన్ని భాష‌ల‌లో క‌లిపి 20 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ సినిమాపై అంఛ‌నాల‌ను భారీగా పెరిగాయి.

చదవండి: శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్‌, లక్ష్మి ప్రసన్న

ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన ‘ప‌డదే.. పడదే’ ఫ‌స్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘అదిరే నిను చూసే క‌నులే నీ స్నేహం కోసం క‌దిలే..అదిగో నిను చూస్తేనే...’ అంటూ సాగే ఈ పాట‌కు అనంత్ శ్రీ‌ రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించాడు. త‌మ‌న్ క్యాచీ ట్యూన్ మ‌రోసారి సంగీత ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. విశాల్, మృణాలిని ర‌వి మ‌ధ్య‌ కెమిస్ట్రీ ఈ పాట‌కి హైలెట్‌గా నిలిచింది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని భాషలలో ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement