బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్‌

Ram Gopal Varma Shocking Video Goes Viral In Birthday Party - Sakshi

Ram Gopal Varma: రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈ పేరు వింటే చాలు సంచలన వ్యాఖ్యలు, వివాదాలు గుర్తుకువస్తాయి.  ఒకప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరున్న ఆర్జీవీ ఈ మధ్య తరచూ కాంట్ర‌వ‌ర్సీలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఏలా స్పందిస్తాడో ఊహించడం కష్టం. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని అందరికంటే భిన్నంగా చూసే వర్మ తన తీరుతో ఎదుటివారిని ఇబ్బంది పెడ్డతాడు. ఇక ఈ మధ్యకాలం బుల్లితెర యాంకరమ్మలతో వర్మ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చదవండి: అయ్య బాబోయ్‌..అషురెడ్డితో ఆర్జీవీ అలా.. వీడియో వైరల్‌

ఆ మధ్య బిగ్‌బాస్‌ భామ అరియానా గ్లోరీతో బోల్డ్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ ఇటీవల మరో బిగ్‌బాస్‌ బ్యూటీ అషూ రెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫొటో తీసి షాక్‌ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాక పలువురు సినీ తారలు, నటీనటులతో ఆయన చేసే రచ్చ మాములుగా ఉండదు. సినిమా సెలబ్రేషనస్‌, బర్త్‌డే పార్టీలో ఆ మూవీ హీరోయిన్లతో డ్యాన్స్‌ చేసి హాట్‌టాపిక్‌గా మారుతాడు. తాజాగా ఇలానే మరోసారి వర్మ వార్తల్లోకి ఎక్కాడు. బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో ఆయన ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

చదవండి: సెక్స్‌ రాకెట్‌: టాప్‌ మోడల్‌, నటి అరెస్ట్‌

‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్బుక్ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ అమ్మాయి బర్త్‌డే వేడుకను జరుపుతున్నారు. ఇందులో నటి జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్‌లు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి కేక్‌ కట్‌ చేస్తుండగా వర్మ ఆ ఆమెతో కాస్తా ఇబ్బందికరంగా వ్యవహరించాడు. దీంతో ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు ఆర్జీవీపై మండిపడుతుండగా మరికొందరూ ‘మహానుభావుడు’ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతేగాక ‘బతికితే వర్మలా బ్ర‌తకాలి’, ‘వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది వ‌ర్మ తుంట‌రి చేష్ట‌లు మరింత పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top