హిట్‌ అయితే పెద్ద సినిమానే  | Hero Suman Launched VICTOR Movie Title Poster | Sakshi
Sakshi News home page

హిట్‌ అయితే పెద్ద సినిమానే 

Dec 22 2023 4:16 AM | Updated on Dec 22 2023 4:16 AM

Hero Suman Launched VICTOR Movie Title Poster - Sakshi

ప్రీతమ్, వేణుగోపాల చారి, సుమన్‌

‘‘ప్రేక్షకుల సహకారంతో 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చిన్న, పెద్ద సినిమాలనేవి ఉండవు. హిట్‌ అయితే పెద్ద సినిమా.. ఫట్‌ అయితే చిన్న సినిమా. ‘విక్టర్‌ ది నెక్ట్స్‌ గాడ్‌’ సినిమాలో 200 మంది నటీనటులకు చాన్స్‌  ఉండటం హ్యాపీ. నూతన సాంకేతిక నిపుణులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’’ అని సుమన్‌ అన్నారు. నూతన నటీనటులతో ప్రీతమ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘విక్టర్‌ ది నెక్ట్స్‌ గాడ్‌’.

అమేజింగ్‌ గ్లోబల్‌ మూవీ మేకర్స్‌పై రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ లోగో లాంచ్‌ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్‌ టైటిల్‌ లోగోని రిలీజ్‌ చేశారు. ప్రీతమ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక సందేశాత్మక చిత్రం. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాకీ–రవి, సంగీతం: రమేష్‌ ముక్కెర, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: బీఏ వర్మ.

Advertisement
 
Advertisement
Advertisement