OTT / Theater Movie Releases: ఈ వారం ఓటీటీ, థీయేటర్లో విడుదలయ్యే చిత్రాలివే

Here Is Movies List Which Is Releasing On Theaters and OTT In October 4th Week - Sakshi

కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్‌ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్‌ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక దసరా తర్వాత వెండితెరపై చిన్న సినిమాల హవా కొసాగుతోంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన చిత్రాలు ఇప్పుడు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ అయ్యి ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకోస్తోన్న ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.

వరుడు కావలేను


నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆకాశ్‌ పూరీ ‘రొమాంటిక్‌’


ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి, ముంబై బ్యూటీ కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాడూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మిలు సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 29న రొమాంటిక్‌ థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో అలరించనున్నారు. 

అనిల్‌ ఇనమడుగు ‘తీరం’


అనిల్‌ ఇనమడుగు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. శ్రావణ్‌ వైజీటీ మరో హీరో. క్రిస్టెన్‌ రవళి, అపర్ణ కథానాయికలు. యం శ్రీనివాసులు నిర్మంచిన ఈ చిత్రం అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు జంటల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, రొమాంటిక్‌గా తెరక్కించాడు అనిల్‌.

రావణ లంక


క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది, దీంతో అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ చిత్రంలో మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

జై భజరంగి 2


కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’ చిత్రానికి సీక్వెల్‌గా ఏ. హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. నిరంజన్‌ పన్సారి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్‌ విడుదలైంది. 

ఓటీటీలో

జీ5

ఆఫత్‌ ఈ ఇష్క్‌(హిందీ) అక్టోబరు 29

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

హమ్‌ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29

అమెజాన్‌ ప్రైమ్‌

డైబుక్‌(హిందీ) అక్టోబరు 29

నెట్‌ఫ్లిక్స్‌

లాభం(తమిళం) అక్టోబరు 24

ఆర్మీ ఆఫ్‌ దీవ్స్‌ , అక్టోబరు 29

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top