స్నేహానికి హద్దు లేదురా! | haddu leduraa trailer launch | Sakshi
Sakshi News home page

స్నేహానికి హద్దు లేదురా!

Mar 18 2024 3:54 AM | Updated on Mar 18 2024 3:54 AM

haddu leduraa trailer launch - Sakshi

∙ఆశిష్‌ గాంధీ, ఎస్తేర్‌

‘‘ఏ దర్శకుడికైనా ఫస్ట్‌ మూవీ బర్త్‌ లాంటింది. నా తొలి చిత్రం ‘డాన్‌ శ్రీను’ ని ఇప్పటికీ మర్చిపోలేను. మనమేంటో ఇండస్ట్రీకి తెలియజేసేదే తొలి సినిమా. ‘హద్దు లేదురా’ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే రాజశేఖర్‌ తొలిసారి దర్శకత్వం వహించినట్లు అనిపించడం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని అన్నారు. ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా, ఎస్తేర్‌ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘హద్దు లేదురా’.

రాజశేఖర్‌ రావి దర్శకత్వంలో వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్‌రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి గోపీచంద్‌ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్‌ రావి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా యూనిట్‌ని ప్రోత్సహించాలి’’ అన్నారు వీరేష్‌ గాజుల బళ్లారి. నటీనటులు ఆశిష్‌ గాంధీ, తనికెళ్ల భరణి, రాధా మనోహర్‌ దాస్, ఎస్తేర్‌ మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement