GV Prakash's 100th film as a music composer - Sakshi
Sakshi News home page

G. V. Prakash Kumar:సెంచరీ కొట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్‌, హీరోగా కొత్త సినిమా, పదేళ్ల తర్వాత..

Jul 31 2023 9:53 AM | Updated on Jul 31 2023 10:10 AM

GV Prakash Act and Produce a Movie - Sakshi

25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వె

సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్‌ కుమార్‌. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్‌ చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు.

ఆ తరువాత తమిళంలో డార్లింగ్‌ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్‌ కుమార్‌ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది.

ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్‌ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్‌ కుమార్‌ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: జైలర్‌కు తెలుగు సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement