గొప్ప మేధావి కార్ల్‌మార్క్స్
సాక్షి, చైన్నె : తమిళనాడు, తమిళ భాష అభ్యున్నతికి శ్రమించిన, తమిళనాడుకు ఖ్యాతిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులను స్మరిస్తూ స్మారక చిహ్నాలు, మందిరాలు, విగ్రహాల ప్రతిష్టను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఆ దిశగా జర్మన్ తత్వవేత్త, విప్లవ కారుడు, ఆర్థిక వేత్త, చరిత్ర కారుడు, సోషలిస్టు, కమ్యూనిజం రూపకర్త కార్ల్‌మార్క్స్‌కు సైతం విగ్రహాన్ని చైన్నెలో ప్రతిష్టించేందుకు అసెంబ్లీ వేదికగా గత ఏడాది ఏప్రిల్‌లో తీర్మానించారు. ప్రపంచ విప్లవాలకు, సాధించిన విజయాలకు కార్ల్‌మార్క్స్ నివేదికను వివరిస్తూ మార్చి 14వ తేదీన ఆయన స్మారక దినోత్సవం అని గుర్తు చేస్తూ, కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని చైన్నెలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. చైన్నెలోని ఎగ్మూర్ మ్యూజియం కాంప్లెక్స్‌లో ఉన్న కన్నెమరా పబ్లిక్ లైబ్రరీ ప్రధాన గేటు వద్ద విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రూ. 85.80 లక్షలతో నిలువెత్తు విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహాన్ని శుక్రవారం ఉదయం సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. కార్ల్ మార్క్స్ విగ్రహానికి, అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత కథను వివరించడానికి ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ ప్రదర్శనను ఆయన సందర్శించారు. మంత్రులు ఏవీ వేలు, ఎం సుబ్రమణియన్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎంపీ టీఆర్‌బాలు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, సీపీఐ నేత వీర పాండియన్, సీపీఎం నేత పి షణ్ముగం నాల్గొన్నారు.
రూ.348 కోట్లతో వైద్య భవనాలు
సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వైద్య, ఆరోగ్యశాఖ నేతృత్వంలో రూ. 348.59కోట్లతో వివిధ జిల్లా కేంద్రాల ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులకు అదనపు భవనాలు, ప్రయోగ శాలలు, హోమియోపతి డివిజన్ భవనాలు, పట్టణ, గ్రామీణ, వివిధ ఆరోగ్యకేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే అటవీ శాఖ నేతృత్వంలో చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తమిళనాడులో సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేయడమే కాకుండా శ్రీతమిళనాడు రాష్ట్రానికి పట్టణ పచ్చదనం విధానం – 2026 విడుదల చేశారు. అనంతరం తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో రూ.2,091 కోట్ల పెట్టుబడితో 2104 మందికి ఉపాధి కల్పించే విధంగా మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనింగ్ పరికరాల తయారీ కర్మాగారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నామక్కల్, పుదుకోట్టైలలో రూ.289 కోట్లతో నిర్మించిన సమత్తువపురంలను సీఎం ప్రారంభించడమే కాకుండా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ భవనాలు, రోడ్లు, వంతెనలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజయం సాధించిన విద్యార్థులను సీఎం అభినందించారు. పరేడ్‌లో రాణించిన విభాగాల అధికారులను సత్కరించారు.
కార్ల్‌మార్క్స్ గొప్ప మేధావి అని
సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రగతిశీల
ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా వాటి
నుంచి బలాన్ని పొందుతామన్నారు.
ఆధిపత్య శక్తులు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఘటిస్తామని పేర్కొంటూ,
ఇది ద్రావిడ మోడల్ అని వివరించారు.
గొప్ప మేధావి కార్ల్‌మార్క్స్
గొప్ప మేధావి కార్ల్‌మార్క్స్


