మైక్రో ప్లాస్టిక్‌ అలర్ట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మైక్రో ప్లాస్టిక్‌ అలర్ట్‌ తప్పనిసరి

Feb 7 2026 9:47 AM | Updated on Feb 7 2026 9:47 AM

మైక్ర

మైక్రో ప్లాస్టిక్‌ అలర్ట్‌ తప్పనిసరి

సాక్షి, చైన్నె: ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లలో మైక్రో ప్లాస్టిక్‌ అలర్ట్‌ తప్పనిసరిగా పొందుపరచాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం తాగునీరుగా ఉపయోగిస్తున్న వాటర్‌ బాటిళ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా కేంద్రం తరఫున ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లలో మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించినట్టు నివేదిక సమర్పించింది. దీంతో ఇక వాటర్‌ బాటిళ్లలో మైక్రో ప్లాస్టిక్‌ హెచ్చరికతో కూడిన వ్యాఖ్యలు తప్పనిసరిగా పేర్కొంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చర్చలకు బీజేపీ కమిటీ

సాక్షి, చైన్నె: కూటమిలోకి మరిన్ని పార్టీలను చేర్చడంతో పాటు సీట్లు, పొత్తుల చర్చలకు బీజేపీ కమిటీని రంగంలోకి దించింది. పార్టీ నేత వీపీ దురైస్వామి నేతృత్వంలో ఈ కమిటీని నియమిస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేతో కలసి ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్‌డీఏ కూటమిలోకి పార్టీలను ఆహ్వానించే బాధ్యతలను బీజేపీ భుజాన వేసుకుని ఉండడం గమనార్హం.

ఐఐటీకి రూ.600 కోట్ల

డీప్‌టెక్‌ ఫండ్‌

సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌, యూనికార్న్‌ ఇండియా వెంచర్స్‌ కలసి రూ.600 కోట్ల డీప్‌టెక్‌ వెంచర్‌ ఫండ్‌ను ప్రారంభించాయి. ‘ఐఐటీ మద్రాస్‌ యూనికార్న్‌ ఫ్రాంటియర్‌ ఫండ్‌–ఐ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ నిధి, రోబోటిక్స్‌, స్పేస్‌ టెక్‌, డిఫెన్స్‌ టెక్‌, సెమీ కండక్టర్లు వంటి వ్యూహాత్మక రంగాల్లోని స్టార్టప్‌లకు మద్దతు అందించనున్నారు. శుక్రవారం ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో జరిగిన ఈ–సమ్మిట్‌ 2026 ప్రారంభోత్సవంలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి ఈ ఫండ్‌ను ప్రకటించారు. ఈ నిధికి రూ.400 కోట్ల గ్రీన్‌ షూ ఆప్షన్‌ ఉండగా, ప్రారంభ దశలో 25కు పైగా డీప్‌టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనుంది. ప్రారంభ దశ డీప్‌టెక్‌ కంపెనీలపై దృష్టి సారించే ఈ ఫండ్‌లో సగటు పెట్టుబడి రూ.8 నుంచి రూ 10 కోట్లు ఉంటుందని తెలిపారు. భారతదేశ సాంకేతికతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఫండ్‌ ఏర్పాటు చేశామని ప్రొఫెసర్‌ కామకోటి తెలిపారు. దేశీయ ఆవిష్కరణలు, లోతైన సాంకేతిక వ్యవస్థాపకతకు ఇది కీలకంగా మారుతుందని ఆయన చెప్పారు.

చైన్నెలో బర్డ్‌ ఫ్లూ?

కాకుల మృతిపై అనుమానం

ప్రజలకు ఆరోగ్యశాఖ అలర్ట్‌

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో ఇటీవల కాకులు మృతిచెండం కలకలం రేపుతోంది. బర్డ్‌ఫ్లూ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతిచెందిన కాకులను చేతులతో ముట్టుకోవద్దని ఆరోగ్యశాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో బర్డ్‌ఫ్లూ కలకలంతో సరిహద్దుల్లో ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రతి వాహనాన్ని క్రిమి సంహారక మందులతో పిచికారీ చేసినానంతరం అనుమతిస్తున్నారు. కేరళ నుంచి తమిళనాడులోకి వచ్చే సరిహద్దుల వద్ద ఆరోగ్య శిబిరాలు ఏర్పాటయ్యాయి, కొద్ది రోజులుగా చైన్నె నగరం, శివారులలో కాకులు మృతిచెందుతుండడం కలకలం రేపుతోంది. అడయార్‌ పరిసరాలో మృతిచెందిన కాకుల కళేబరాలను పశు పరిశోధన సంస్థకు అప్పగించారు. ప్రాథమిక నివేదికల ఆధారంగా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించినట్టు అధికారులు భావించినా, అక్కడక్కడ కాకుల మృతితో బర్డ్‌ ఫ్లూ అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన చేసింది. వైరస్‌ సోకిన కోళ్లు లేదా పక్షులను ఇతర పక్షులతో చేర్చొద్దని, వ్యాధి సోకిన పక్షులను మనుషులు తాకితే వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరించింది. అలాగే, దోమల ద్వారా వెస్ట్‌ నైల్‌ వైరస్‌ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని భావిస్తున్నారు. ఆరో గ్య శాఖ అధికారులు మాట్లాడుతూ, బర్డ్‌ఫ్లూ కోళ్లకు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందని, కాబట్టి చికెన్‌ను పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని, చనిపోయిన పక్షులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు లేదా వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అయితే, ప్రస్తుతం చైన్నెలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాలేదని, పక్షుల మరణాలపై అనవసర భయాందోళనలు చెందనవసరం లేదన్నారు.

మైక్రో ప్లాస్టిక్‌  అలర్ట్‌ తప్పనిసరి 1
1/1

మైక్రో ప్లాస్టిక్‌ అలర్ట్‌ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement