ముగిసిన గోల్‌ఘాట్ బాల్ పోటీలు
తిరుపతి అర్బన్: నగరంలో నాలుగురోజులుగా జరుగుతున్న 3వ సబ్ జూనియర్ బాల బాలికల జాతీయ గోల్‌ఘాట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీలు గేమ్స్ వ్యవస్థాపకుడు నోట్ల రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో జీవకోనలోని విశ్వం స్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోచ్‌లు, రిఫరీలు, వలంటీర్లు, విశ్వం పాఠశాల యాజమాన్యంతోపాటు పలువురు పిల్లల తల్లిదండ్రుల సహకారం అమూల్యమైనదని కొనియాడారు. 23 రాష్ట్రాల నుంచి 500 మందికి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, అసోం, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ నుంచి క్రీడాకారులు విచ్చేశారని వెల్లడించారు. అనంతరం విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశామని పేర్కొన్నారు. గోల్ షూట్ బాల్ ఇండియన్ కోశాధికారి రామ్ ప్రవేశ్ కుమార్ వీరూ, సౌత్ ఇండియా ఇన్‌చార్జి కరుణాకరన్ పాల్గొన్నారు.
ముగిసిన గోల్‌ఘాట్ బాల్ పోటీలు


