'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' ట్రైలర్‌ విడుదల తేదీ ప్రకటన | The Greatest of All Time Movie Trailer Release Date Locked | Sakshi
Sakshi News home page

'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం' ట్రైలర్‌ విడుదల తేదీ ప్రకటన

Aug 15 2024 6:06 PM | Updated on Aug 15 2024 8:03 PM

The Greatest of All Time Movie Trailer Release Date Locked

విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం'. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల ఎప్పుడు అనేది మేకర్స్‌ ప్రకటించారు.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఆగష్టు 17 సాయింత్రం 5గంటలకు గోట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 5న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో సాంకేతికతకు పెద్దపీట వేసినట్లు ఇప్పటికే దర్శకుడు వెంకట్‌ ప్రభు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌  కోసం అవతార్‌, అవెంజర్స్‌ లాంటి హాలీవుడ్ హిట్‌ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు విజయ్‌ గోట్‌ సినిమాకు పనిచేశారు. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.       ఈ చిత్రంలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement