'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ | Gopichand-Srinu Vaitla Viswam Telugu Teaser | Sakshi
Sakshi News home page

Viswam Teaser: గోపీచంద్ 'విశ్వం' టీజర్ ఎలా ఉందంటే?

Sep 3 2024 4:45 PM | Updated on Sep 3 2024 4:48 PM

Gopichand-Srinu Vaitla Viswam Telugu Teaser

గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తె‍లుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)

దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.

టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్‌గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)

Advertisement
 
Advertisement
Advertisement