భీమాని హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌  | Gopichand Speech At Bhimaa Thanks Meet | Sakshi
Sakshi News home page

భీమాని హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌ 

Mar 16 2024 12:51 AM | Updated on Mar 16 2024 12:51 AM

Gopichand Speech At Bhimaa Thanks Meet - Sakshi

మారుతి, గోపీచంద్, సంపత్‌ నంది

గోపీచంద్‌ 

‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్‌లో మంచి వేరియేషన్స్‌ చూపించారని మంచి అప్లాజ్‌ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని గోపీచంద్‌ అన్నారు. గోపీచంద్‌ హీరోగా  కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది.

ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్‌ మీట్‌లో దర్శకులు మారుతి, సంపత్‌ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్‌ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్‌. మాళవికా శర్మ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement