`ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్ చూశారా? | Gopichand Malineni Launch Chalo Premiddam Movie First Look, Motion Poster | Sakshi
Sakshi News home page

Gopichand Malineni: డైరెక్టర్‌ గోపీచంద్‌ చేతుల మీదుగా `ఛ‌లో ప్రేమిద్దాం` ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Oct 24 2021 9:14 PM | Updated on Oct 24 2021 9:19 PM

Gopichand Malineni Launch Chalo Premiddam Movie First Look, Motion Poster - Sakshi

 సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ...``ఓ రోజు డైర‌క్ట‌ర్ సురేష్ వ‌చ్చి మోష‌న్ పోస్ట‌ర్ చూపించారు. మోష‌న్ పోస్ట‌ర్  న‌చ్చడంతో లాంచింగ్ కి వ‌చ్చాను. అంద‌రూ ప్రొడ్యూస‌ర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంక‌ట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఒక కొత్త డైర‌క్ట‌ర్ కి ఎంత స‌పోర్ట్ చేయాలో అంత స‌పోర్ట్ చేశారు. అలా ఛ‌లో ప్రేమిద్దాం నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న ఉద‌య్ కిర‌ణ్ క‌చ్చితంగా గొప్ప నిర్మాత‌గా ఎదుగుతారు. ఇక ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ చూశాక విజువ‌ల్ ట్రీట్ లా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థమ‌వుతోంది`` అన్నారు.

ఈ సినిమాను నవంబ‌ర్ నెలాఖ‌రులో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌, సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement