ఓటీటీలో గోపీచంద్‌ 'భీమా'.. రిలీజ్‌ ఆ రోజేనా..? | Gopichand Bhimaa Movie OTT Release Date Announced, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Bhimaa Movie OTT Release Date: ఓటీటీలో గోపీచంద్‌ 'భీమా'.. రిలీజ్‌ ఆ రోజేనా..?

Mar 26 2024 9:17 AM | Updated on Mar 26 2024 11:13 AM

Gopichand Bhimaa OTT Release Date Announced - Sakshi

భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్‌ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్‌ వద్ద డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్‌ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్‌ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. 

మార్చి 8న థియేట‌ర్ల‌లో విడుదలైన భీమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్‌ హిట్‌ అనుకున్నారు. కానీ తర్వాత  ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్‌ అయిందని ఆడియన్స్‌ చెప్పుకొచ్చారు.

భీమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌తో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్లు సోషల్‌ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్‌ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement