ట్రెండ్‌కి తగ్గట్లే 'భీమా' ట్రైలర్.. కాకపోతే ఆ విషయమే? | Actor Gopichand Bhimaa Telugu Movie Trailer Released, Check Trailer Highlights Inside - Sakshi
Sakshi News home page

Bhimaa Movie Trailer Highlights: దాన్నే నమ్ముకున్న గోపీచంద్.. ఈసారైనా హిట్ కొడతాడా?

Published Sat, Feb 24 2024 5:26 PM

Gopichand Bhimaa Movie Trailer Telugu - Sakshi

తెలుగు హీరోల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే మాట చాలా కాలమైంది. ఇలాంటి వాళ్లలో గోపీచంద్ ఒకడు. సిక్స్ ఫీట్ కటౌట్‌తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. అలా 'భీమా' చిత్రంతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'భీమా' ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్‌తో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో పోలీస్‌, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా  ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్‍‌లా? లేదా ఒకడే ఇద్దరా అనేది సినిమా వస్తే తెలుస్తోంది.

ట్రైలర్ పరంగా చూస్తుంటే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు డివోషనల్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో ఉంది. అయితే ట్రైలర్‌లోనే చాలావరకు స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే సినిమాలోనూ ఫైట్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే 'భీమా'లో దీన్ని మించి ఏముంటుందనేది చూడాలి. అలానే ఇది హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం కూడా!

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)

Advertisement

తప్పక చదవండి

Advertisement