24 ఏళ్ల తర్వాత క్లాసిక్ మూవీకి సీక్వెల్.. ట్రైలర్ అదుర్స్ | 'Gladiator 2' Movie Telugu Trailer Review | Sakshi
Sakshi News home page

Gladiator 2 Trailer: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న హిట్ సీక్వెల్

Jul 10 2024 8:41 AM | Updated on Jul 10 2024 5:02 PM

'Gladiator 2' Movie Telugu Trailer Review

ఇప్పుడంటే ఓటీటీల వల్ల అన్ని భాషల సినిమాల్ని అందరూ చూస్తున్నారు. కానీ ఒకప్పుడు టీవీలో హాలీవుడ్ చిత్రాలు, వాటిలోని విజువల్స్‌ని చూసి అవాక్కయ్యేవారు. ఎందుకంటే యాక్షన్, పీరియాడిక్ మూవీస్ స్టోరీలతో అదరగొట్టేసేవారు. అలా 2000లో రిలీజై క్లాసిక్‌గా నిలిచిపోయిన ఓ మూవీ 'గ్లాడియేటర్'. ఇప్పుడు దీనికి 24 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీశారు. తాజాగా ట్రైలర్‌తో పాటు మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)

ట్రైలర్ బట్టి చూస్తే తొలి పార్ట్‌కి ఏ మాత్రం స్టోరీని రెడీ చేసినట్లు కనిపిస్తుంది. పురాతన రోమ్ అందాలు, యుద్ధాలు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు 22న తెలుగు, తమిళ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ 'గ్లాడియేటర్ 2' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి మీరు కూడా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: తెలుగు సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హాట్ బ్యూటీ ఊర్వశి!)

Advertisement
 
Advertisement
Advertisement