'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా! | Sakshi
Sakshi News home page

Geethanjali Malli Vachindhi: 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. ఆడియన్స్‌కు ఊహించని షాక్!!

Published Thu, Feb 22 2024 9:15 AM

Geethanjali Malli Vachindhi Team Teaser Release Event Update - Sakshi

అంజలి టైటిల్‌ రోల్‌లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ‘గీతాంజలి’ (2014) సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్  సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్‌ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్‌ లాంఛ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement