ఆసక్తికరంగా 'బ్యూటీ' టీజర్ | Beauty Movie Teaser And Release Date | Sakshi
Sakshi News home page

Beauty Movie: రిలీజ్ డేట్ ఫిక్స్.. 'బ్యూటీ' టీజర్ విడుదల

Aug 23 2025 4:31 PM | Updated on Aug 23 2025 4:40 PM

Beauty Movie Teaser And Release Date

మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి, ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తూ తీసిన సినిమా 'బ్యూటీ'. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. జె.ఎస్.ఎస్.వర్ధన్.. మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు వచ్చాయి.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. 'కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను' అనే ఎమోషనల్ డైలాగ్ ఈ మూవీ కథ ఏంటో చెప్పకనే చెప్పేస్తుంది. టీజర్‌లో విజయ్ బుల్గానిన్ సంగీతం అలరిస్తోంది. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం తదితర చిత్రాలతో ఆకట్టుకున్న అంకిత్.. 'బ్యూటీ' చిత్రంతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement