సాయిధరమ్‌ తేజ్‌ 'విరూపాక్ష' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Sai Dharam Tej Virupaksha Teaser To Be Out On This Date | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej : సాయిధరమ్‌ తేజ్‌ 'విరూపాక్ష' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Feb 26 2023 1:25 PM | Updated on Feb 26 2023 1:27 PM

Sai Dharam Tej Virupaksha Teaser To Be Out On This Date - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్ కార్తీక్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. SDT15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఏప్రిల్‌21న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జోరు పెంచిన మేకర్స్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను వదిలారు. మార్చి 1న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలో సాయితేజ్‌ రిస్కీ బైక్‌ స్టంట్స్‌ డూప్‌ లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా టీజర్‌ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement