
‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాల్లో నటించిన హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శనివారం కావ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె ఇలా కనిపించనున్నారంటూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నేను రెడీ’ కావ్య కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుతున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.