తెలుగు నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి | Fatima Sana Shaikh Clarifies Her Casting Couch Comments | Sakshi
Sakshi News home page

తెలుగు నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌.. క్లారిటీ ఇచ్చిన నటి

Jun 13 2025 12:20 PM | Updated on Jun 13 2025 12:37 PM

Fatima Sana Shaikh Clarifies Her Casting Couch Comments

ఈ ఏడాది ప్రారంభంలో  ‘దంగల్‌’ నటి ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ చిత్ర పరిశ్రమలో  కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు ఏజెంట్‌లు ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూనే  'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?' అని అడిగినట్లు తెలిపింది. ఆపై కొందరు టాలీవుడ్‌ నిర్మాతలు కూడా తనని పరోక్షంగా అలాంటి ప్రశ్నలే వేశారని చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. అయితే, తాజాగా మరోసారి ఫాతిమా రియాక్ట్‌ అయ్యారు.

దక్షిణాదిలో తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమేనని మరోసారి 'దంగల్‌' నటి ఫాతిమా పేర్కొంది. కానీ, తను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం  చేసుకున్నారని తెలిపింది. ఒక వ్యక్తి వల్ల మాత్రమే తాను ఇబ్బంది ఎదుర్కొన్నానని  క్లారిటీ ఇచ్చింది. అతను ఒక ఏజెంట్‌ కావచ్చు లేదా చిన్న నిర్మాత కావచ్చని చెప్పింది. కానీ, దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని స్పష్టత ఇచ్చింది. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అదేపనిగా అక్కడి పరిశ్రమ మొత్తాన్ని ఆపాదిస్తూ ప్రచారం చేయడం చాలా తప్పని పేర్కొంది. ' కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగ చూసే వారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది.' అని ఆమె చెప్పింది.

ఫాతిమా గతంలో ఏం చెప్పిందంటే..
అమిర్ ఖాన్ నటించిన దంగల్‌ మూవీతో  నటి ఫాతిమాకు మంచి గుర్తింపు వచ్చింది. గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రం విడుదలైంది. ఆ మూవీ తర్వత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే  ఒక నిర్మాత నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు  గతంలో ఇలా చెప్పింది. ' హైదరాబాద్‌లో నేను చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్నాను. ఒక హౌటల్‌లో దిగాను. ఆ నిర్మాతలు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి నాతో మాట్లాడారు. నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. నేను కాదని చెప్పడంతో ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగానే అడిగేశాడు. ఇంకోకరు అదే విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా అర్థమైంది.  ఒకప్పుడు బాలీవుడ్‌లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతాను. కానీ, నాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు.' అని ఆమె గతంలో వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement