'విజయ్‌కు అడ్డంకులు.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్' | A fan of Vijay cry at Chennai home today goes viral in social media | Sakshi
Sakshi News home page

Vijay: 'విజయ్‌ అభిమాని కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్'

May 7 2026 3:58 PM | Updated on May 7 2026 4:13 PM

A fan of Vijay cry at Chennai home today goes viral in social media

తమిళ హీరో, దళపతి విజయ్‌ సినిమాల్లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ హీరోగా నిలిచాడు. పాలిటిక్స్‌లో అడుగుపెట్టి తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. సీఎం కావడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ద్రవిడ రాజకీయాలను షేక్ చేశాడు. అన్ని స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. అయితే అధికారం చేపట్టేందుకు మాత్రం ఇంకా సీట్లు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లిస్ట్‌ అందజేశారు. ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం కావడంతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.

తమ హీరో, నాయకుడు అత్యధిక సీట్లు గెలిచినా కూడా సీఎం కావడానికి మరింత సమయం పట్టడంపై ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని విజయ్ ఇంటి బయట పూజలు చేస్తూ కనిపించారు. తమ నాయకుడికి అడ్డంకులు రావడంతో అభిమాని ఆవేదనకు గురయ్యారు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement