'ది ఫ్యామిలీ మ్యాన్‌-3' నటుడు అనుమానాస్పద మృతి | The Family Man Actor Rohit Basfore Passed Away | Sakshi
Sakshi News home page

'ది ఫ్యామిలీ మ్యాన్‌-3' నటుడు అనుమానాస్పద మృతి

Apr 29 2025 9:21 AM | Updated on Apr 29 2025 10:08 AM

The Family Man Actor Rohit Basfore Passed Away

ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారతీయ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ టాప్‌లో ఉంటుంది. అయితే, సీజన్- 3లో నటించిన నటుడు రోహిత్‌ బస్ఫోర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సాం గర్భంగ అటవీప్రాంతంలోని జలపాతం వద్దకు  రోహిత్‌ బస్ఫోర్‌ వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ హత్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్‌ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కుమారుడితో గొడవ పడ్డారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్‌ను  ట్రిప్‌కు వెళ్దాం అంటూ జిమ్ యజమాని అమర్‌దీప్‌ ఆహ్వానం మేరకే వెళ్లాడని వారు పోలీసులకు తెలిపారు. 

ఇదంతా ఒక ప్లాన్‌ ప్రకారమే తమ కుమారుడిని హత్య చేశారని వారు చెబుతున్నారు.  గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపైనే కాకుండా తల, ముఖం ఇతర భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్‌ బస్ఫోర్‌ నటించిన  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-3’ త్వరలో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement