'ది ఫ్యామిలీ మ్యాన్' అభిమానులకు సర్‌ప్రైజ్‌ | The Family Man 3 Web Series First Glimpse Out Now, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

'ది ఫ్యామిలీ మ్యాన్' అభిమానులకు సర్‌ప్రైజ్‌

Jun 28 2025 3:34 PM | Updated on Jun 28 2025 3:57 PM

The Family Man 3 First Glimpse Out Now

ఓటీటీలో 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌ సిరీస్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. వారిని సర్‌ప్రైజ్‌ చేస్తూ తాజాగా ఒక వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. తొలి సిరీస్‌ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్‌ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సిరీస్‌లు సూపర్‌ హిట్‌ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్‌ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌లో  మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించారు. ఆయనకు జోడీగా ప్రియమణి నటించారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. త్వరలోనే  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా అందుబాటులోకి రానుంది.

ఈ సిరీస్ తొలి సీజన్‌ భారత్‌పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్‌పై చేసే ఆపరేషన్‍ వంటి కాన్సెప్ట్‌ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.  దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్‌ తివారీగా  మనోజ్‌ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా  ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్‌లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్‌ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్‌ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement