విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు.
జనవరి 20 (మంగళవారం) దునియా విజయ్ బర్త్ డే సందర్భంగా ‘స్లమ్‌డాగ్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘దునియా విజయ్‌గారు ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రను ఈ సినిమాలో చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని యూనిట్ పేర్కొంది.


