Drushyam 2 : వరుణ్‌ మర్డర్‌ కేసు నుంచి రాంబాబు బయటపడ్డాడా? | Drushyam 2 Telugu Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Drushyam 2 Trailer: రాంబాబుకు పోలీసులు సినిమా చూపించారా?

Nov 15 2021 9:32 PM | Updated on Nov 15 2021 10:12 PM

Drushyam 2 Telugu Movie Trailer Out - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం 2’. సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్‏గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచారు మేకర్స్‌. ఈ నేపథ్యంగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలైంది.

ఇందులో వెంకటేశ్‌ థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వరుణ్‌ మర్డర్‌ కేసు విషయంలో రాంబాబు ఫ్యామిలీపై పోలీసు నిఘ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ హత్యను రాంబాబే చేశాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?  ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని  కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తెలియాలంటే నవంబర్‌ 25న ‘దృశ్యం 2’ చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement