హీరోయిన్ కూతురు కొత్త మూవీ.. బడ్జెట్ జస్ట్ రూ.7 లక్షలే! | Actress Babita Daughter Introducing As Heroine With Dream Girl Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

హీరోయిన్ కూతురు కొత్త మూవీ.. బడ్జెట్ జస్ట్ రూ.7 లక్షలే!

Published Sat, Nov 18 2023 5:26 PM | Last Updated on Sat, Nov 18 2023 6:04 PM

Dream Girl Movie Tamil News Latest - Sakshi

సినిమా అనేది ఇప్పుడు వందల కోట్ల వ్యవహారం అయిపోయింది. స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోలు.. వందల కోట్లు అని పరుగెడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న హీరోలు ఏ మాత్రం తగ్గట్లేదు. తక్కువలో తక్కువ రూ.5 కోట్లు బడ్జెట్‌కి మించిన సినిమాల్లోనే నటిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడు ఈమె నటించిన ఈ చిత్రాన్ని కేవలం రూ.6-7 లక్షల్లో పూర్తి చేశారంటే మీరు నమ్ముతారా? అవును మేం చెప్పింది నిజమే.

(ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!)

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్‌ భారతి తీసిన లేటెస్ట్ మూవీ 'డ్రీమ్‌ గర్ల్‌'. చారులతా ఫిల్మ్స్ పతాకంపై కావేరి మాణిక్యం, ఆర్‌ గుణశేఖరన్‌, ఆధిత్యన్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జీవా హీరో. సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ జస్టిన్‌ మనవరాలు, నటి బబిత కూతురు హరిష్మిత హీరోయిన్‌గా పరిచయమవుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ప్రేమకథ అని అన్నారు. కేవలం రూ. 6-7 లక్షల్లో దీన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. తక్కువ బడ్జెట్‌ చిత్రాలకు ఇది ఓ మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం నటీనటులు, సాంకేతిక బృందం సంపూర్ణ సహకారం అందించడంతో ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement