డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా? | Director Puri Jagannadh Son Akash Puri Love Marriage Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Akash Puri Love Marriage Rumours: తెలుగు యంగ్ హీరో ప్రేమ.. త్వరలో ఆమెతో పెళ్లి?

Published Fri, Dec 22 2023 5:51 PM

Director Puri Jagannadh Son Akash Puri Wedding Rumours - Sakshi

టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడా? ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వారసుడే అని తెలుస్తోంది. అలానే అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలేం జరుగుతోంది?

(ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

దర్శకుడు పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు. తనదైన స్టైల్ ఆఫ్ మూవీస్‪‌తో అప్పట్లో ఊపు ఊపాడు. ఇతడి కొడుకు ఆకాశ్.. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేడు.

కొన్నాళ్ల నుంచి అసలెక్కడ వినిపించని ఆకాశ్ పూరీ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. చిన్నప్పటి క్లాస్‌మేట్ ఒకమ్మాయితో ఆకాశ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని అంటున్నారు. అలానే అమ్మాయి తాత పెద్ద పొలిటికల్ లీడర్ అని అంటున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాలి. లేదంటే స్వయంగా ఆకాశ్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు!

(ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?)

 
Advertisement
 
Advertisement