ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా | Ala Ninnu Cheri Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Ala Ninnu Cheri In OTT: సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతున్న ఆ మూవీ

Published Fri, Dec 22 2023 2:59 PM

Ala Ninnu Cheri Movie OTT Release Date Streaming Details - Sakshi

ఈ వారం అందరూ 'సలార్' బిజీలో ఉన్నారు. చాలారోజుల పాటు వెయిట్ చేయించి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తొలిరోజు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో చాలామంది మూవీ లవర్స్‌కి టికెట్స్ దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. అదే టైంలో ఓటీటీలోకి పలు మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: ‘సలార్‌’ మూవీ రివ్యూ)

ఈ శుక్రవారం ఓటీటీలోకి ఆదికేశవ, టోబి లాంటి స్ట్రెయిట్-తెలుగు మూవీస్ వచ్చేశాయి. వీటితో పాటు మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన 'అలా నిన్ను చేరి' చిత్రం.. నవంబరు 10న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, అప్పుడు వరల్డ్ కప్ హంగామా ఉండటంతో ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో దినేశ్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మారేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు.

కథ విషయానికొస్తే.. దివ్య (పాయల్ రాధాకృష్ణ)కి ఈమె తల్లి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం గణేశ్ (దినేశ్ తేజ్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లిద్దరి మధ్యలోకి అను (హెబ్బా పటేల్) వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా స్టోరీ.

(ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్‌! దిమ్మతిరిగే రేటుకు..)

Advertisement
Advertisement