దర్శకుడు పార్థిపన్‌కు పితృవియోగం 

Director Parthiban Desingus Father Passed Away Due To COVID -19 - Sakshi

చెన్నై: సినీ దర్శకుడు పార్థిపన్‌ దేశింగ్‌కు పితృవియోగం కలిగింది. ఈయన తండ్రి వి.దేశింగ్‌ (80) కరోనా కారణంగా సోమవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవల కరోనా లక్షణాలు ఉండడంతో ఇంటిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆక్సిజన్‌ లెవెల్‌ తగ్గడంతో కుటుంబ సభ్యులు గత నెల 23వ తేదీ పాండిచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top