సర్కిల్‌లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా | Director Neelakanta Speech at Circle Trailer Launch Event | Sakshi
Sakshi News home page

సర్కిల్‌లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా

Jun 27 2023 1:42 AM | Updated on Jun 27 2023 5:53 AM

Director Neelakanta Speech at Circle Trailer Launch Event - Sakshi

నీలకంఠ, రిచా, సాయి రోనక్, అర్షిణ్‌

‘‘నా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను. ‘షో’లో మంజుల, ‘మిస్సమ్మ’లో లయ, భూమిక, ‘సదా మీ సేవలో’ చిత్రంలో శ్రియ.. ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్‌ బాగుంటాయని అందరూ చెబుతారు. ‘సర్కిల్‌’లోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కొత్తగా కనిపిస్తుంది. అర్షిణ్, సాయి రోనక్, బాబా భాస్కర్‌ కూడా చక్కగా నటించారు’’ అని డైరెక్టర్‌ నీలకంఠ అన్నారు.

సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్‌’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి. సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నీలకంఠగారితో పని చేయడం ఒక ఛాలెంజ్‌. ఈ సినిమా షూటింగ్‌ని ఎంజాయ్‌ చేశాను’’ అన్నారు సాయి రోనక్‌. ‘‘ఇదొక డిఫరెంట్‌ మూవీ.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శరత్‌ చంద్ర.

Advertisement
 
Advertisement
Advertisement