దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్ | Netizens Trolls On Director Amar Kaushik Over His Comments On Shraddha Kapoor Smile, Deets Inside | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: స్టార్ హీరోయిన్ పై దర్శకుడి కామెంట్స్.. ఫ్యాన్స్ ఆగ్రహం

Apr 6 2025 12:59 PM | Updated on Apr 6 2025 2:48 PM

Director Amar Kaushik Comment On Shraddha Kapoor Smile

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. గతేడాది స్త్రీ 2 మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రద్ధా నవ్వుపై విచిత్రమైన కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె అభిమానులు సదరు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

'స్త్రీ సినిమా తీయాలని అనుకున్నప్పుడు హీరోయిన్ ఎవరిని తీసుకుందామా అని చాలా ఆలోచించాం. ఆ టైంలో శ్రద్ధా కపూర్ పేరుని నిర్మాత దినేశ్ విజన్ ప్రతిపాదించారు. ఆమెనే ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా నాతో చెప్పారు. ఓసారి దినేశ్, శ్రద్ధా విమానంలో వెళ్తున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నారట. ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, అందుకే ఈ పాత్రకు ఆమె అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన నాతో చెప్పారు' అని డైరెక్టర్ అమర్ కౌశిక్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇంట విషాదం)

ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై శ్రద్దా కపూర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో సినిమా తీసి, హిట్ కొట్టి ఇలా మాట్లాడటం తగునా అని అంటున్నారు. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

శక్తి కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి 2010లో శ్రద్దా వచ్చింది. తీన్ పట్టి మూవీతో హీరోయిన్ అయింది. ఆషికి 2 మూవీ ఈమె కెరీర్ ని మలుపు తిప్పింది. ప్రభాస్ సాహో మూవీలోనూ హీరోయిన్ గా చేసింది గానీ పెద్దగా ఉపయోగపడలేదు. ఇకపోతే స్త్రీ 3 మూవీ 2027లో వస్తుందని ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' గ్లింప్స్‌ వచ్చేసింది.. సిక్సర్‌ కొట్టిన రామ్‌ చరణ్‌)

Advertisement
 
Advertisement
Advertisement