అల్లు అర్జున్‌ ‘ఐకాన్’ మూవీపై దిల్‌రాజు క్లారిటీ

Dil Raju Announce ICON Is Our Immediate Next Film - Sakshi

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ముందుగా అనుకున్న తేది ప్రకారం ఆగష్టు 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోకుండా కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతుండటంతో షూటింగ్‌ ఆలస్యమవుతోంది. తో పుష్ప విడుదల మరో నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టు 13 తేదీని వాయిదా వేసి డిసెంబర్ 17న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పుష్ప అనంతరం బన్నీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ఏ క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

చదవండి: అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా

అయితే పుష్పకు ముందు శ్రీరామ్‌ వేణు డైరెక్షన్‌ బన్నీ ‘ఐకాన్‌’..కనబడుట లేదు అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది వీలు కాకపోవడంతో తరువాత బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో, శ్రీరామ్‌ పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇటీవల జరిగిన వకీల్‌సాబ్‌ ప్రమోషనల్లో దర్శకుడు శ్రీరామ్‌ను అందరూ బన్నీతో ఐకాన్‌ సినిమా ఎప్పుడు స్టార్‌ కానుందని ప్రశ్నించారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభంపై తనకు ఎలాంటి అప్‌డేట్‌ అందలేని సమాధానమిచ్చారు.

చదవండి: తమ్ముడికి కంగ్రాట్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌.. కారణం ఇదే

తాజాగా ఐకాన్‌ సినిమాపై నిర్మాత దిల్‌రాజ్‌ క్లారిటీ ఇచ్చారు. వకీల్‌సాబ్‌ ప్రెస్‌ మీట్‌లో ఐకాన్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటలతో బన్నీ ఐకాన్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తమ తక్షణ తదుపరి ప్రాజెక్టు ఐకాన్‌ అని దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నాకు ఈ స్క్రిప్ట్‌తో బాగా కనెక్ట్‌ అయ్యాను. నా హార్ట్‌కు టచ్‌ అయ్యింది. శ్రీరామ్‌వేణు స్టోరీ వినిపించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దీనిపై పనిచేయాలన్న ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం’. అని వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top