దిల్‌ కొల్లగొట్టింది | Dil Bechara movie Gets 95 million Views in First 24 Hours | Sakshi
Sakshi News home page

దిల్‌ కొల్లగొట్టింది

Jul 31 2020 5:07 AM | Updated on Jul 31 2020 5:07 AM

Dil Bechara movie Gets 95 million Views in First 24 Hours - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, సంజనా సింగ్

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ అందరి çహృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం హృదయాలనే కాదు పలు రికార్డులనూ కొల్లగొట్టిందని లెక్కలు చెబుతున్నాయి. ముఖేశ్‌ చాబ్రా దర్శకత్వంలో సుశాంత్‌ సింగ్, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. పోయిన వారం ఈ చిత్రం హాట్‌స్టార్‌ లో రిలీజ్‌ అయింది. తొలి రోజు సుమారు 95 మిలియన్‌ వ్యూస్‌ సాధించిందట ‘దిల్‌ బేచారా’. అంటే.. సుమారు తొమ్మిదిన్నర కోట్లు.

ఒకవేళ ఇది థియేట్రికల్‌ బిజినెస్‌లో లెక్కకట్టి చూస్తే... ప్రస్తుతం మన దగ్గర టికెట్‌ ధర 150 ఉంది అంటే ఈ సినిమా తొలి రోజే 1500  కోట్లు బిజినెస్‌ చేసినట్టు. ప్రస్తుతం ఒక్కో సినిమా వంద కోట్లు వసూళ్లను చేరుకోవాలంటే సుమారు 4 రోజులు పడుతుంది. కానీ ‘దిల్‌ బేచారే’ని తొలిరోజే తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించడం రికార్డే. సుశాంత్‌ చివరి చిత్రం కావడం తో తప్పక చూడాలని ప్రేక్షకులు అతనికి ప్రేమగా ఇచ్చిన నివాళి ఇది. హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అలాగే మొదటిరోజు ఎక్కువ మంది చూస్తూ ఉండటంతో హాట్‌స్టార్‌ క్రాష్‌ అయిందని కూడా వార్తలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement