
నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్‌తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.
నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)
ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్‌కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.
నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్‌గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: 'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్)