
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్, రష్మిక మాట్లాడుకుంటున్న ఓ కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్, రష్మిక చిరునవ్వులు చిందిస్తూ, ఏవో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఈపోస్టర్ ఉంది. తమిళ్, తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.