తండ్రీకొడుకుల నేపథ్యంలో... | Dhanraj Turns Director Stars Along With Samuthirakani | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకుల నేపథ్యంలో...

Oct 23 2023 1:36 AM | Updated on Oct 23 2023 1:36 AM

Dhanraj Turns Director Stars Along With Samuthirakani - Sakshi

ధన్‌రాజ్‌

నటుడు ధన్ రాజ్‌ దర్శకుడిగా మారారు. ఈ కొత్త చిత్రంలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్ రాజ్‌ నటించనున్నారు. ప్రభాకర్‌ ఆరిపాక సమర్పణలో స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై పొలవరపు పృథ్వి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుబ్బు కెమెరా స్విచ్చాన్  చేయగా, నటుడు శివబాలాజీ క్లాప్‌ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘బలగం’ దర్శకుడు వేణు గౌరవ దర్శకత్వం వహించగా, తెలుగు స్క్రిప్ట్‌ను దర్శకుడు రాజేంద్ర, తమిళ స్క్రిప్ట్‌ను దర్శకుడు భరత్‌కమ్మ యూనిట్‌ సభ్యులకు అందించారు. ‘విమానం’ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్‌ యానాల ఈ మూవీకి కథ–మాటలు అందిస్తున్నారు.

‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. నవంబరు 9 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌నుప్రారంభించనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రంప్రారంభోత్సవంలో నటులు సుడిగాలి సుధీర్, చమ్మక్‌ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్, భూపాల్, పృథ్వి, ‘రాకెట్‌’ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: అరుణ్‌ చిలువేరు, కెమెరా: దుర్గా ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement