రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే | Devil Tamil Movie OTT Release Date And Details | Sakshi
Sakshi News home page

Devil OTT: బిగ్‌బాస్ శుభశ్రీ లేటెస్ట్ మూవీ.. ఆ ఓటీటీల్లో రిలీజ్

Feb 28 2024 12:10 PM | Updated on Feb 28 2024 12:36 PM

Devil Movie 2024 Tamil OTT Release Date And Details - Sakshi

మరో హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పూర్ణ నటించిన హారర్ మూవీ ఇది. ఇందులో 'బిగ్‌బాస్ 7' ఫేమ్ శుభశ్రీ కూడా ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుందని, ఒకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

హీరోయిన్‌గా తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం సహాయ పాత్రలు, డ్యాన్స్ నంబర్స్ చేస్తూ బిజీగా మారింది. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో కిరాక్ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ హారర్ మూవీ 'డెవిల్'. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది.  ఇప్పుడు నెల తిరగకుండానే టెంట్ కోటా, అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులున్నాయి.

మార్చి 1 నుంచి రెండు ఓటీటీల్లో 'డెవిల్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. హేమ(పూర్ణ) అలెక్స్ అనే ఫేమ‌స్ లాయ‌ర్‌‌ని పెళ్లి చేసుకుంటుంది. కానీ అతడు త‌న ఆఫీస్‌లోనే ప‌నిచేసే సోఫియా(శుభశ్రీ)తో రిలేష‌న్‌షిప్‌లో ఉంటాడు. ఓరోజు యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోష‌న్(త్రిగుణ్) వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? రోష‌న్‌, హేమ‌ల బంధం గురించి తెలిసిన అలెక్స్ ఏం చేశాడు?  చివరకు ఏమైందనేదే కథ. పూర్ణ యాక్టింగ్ బాగానే చేసినా థియేటర్లలో సినిమా ఫెయిలైంది. ఓటీటీలో కాబట్టి టైంపాస్ కోసమైనా సరే చూసేస్తారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement