Devara Trailer: 'దేవర' ట్రైలర్‌ వచ్చేసింది | Jr NTR Devara Movie Telugu Trailer Out Now, Check Trailer Highlights Inside | Sakshi
Sakshi News home page

Devara Movie Trailer: 'దేవర' ట్రైలర్‌ వచ్చేసింది

Sep 10 2024 5:06 PM | Updated on Sep 10 2024 6:37 PM

Devara Movie Telugu Trailer Out Now

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్‌ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్‌లో  భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌  27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్‌లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.

దేవర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ముంబైలో ప్రమోషన్స్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ ప్రారంభించారు. బాలీవుడ్‌ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్‌ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.

దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement