తండ్రి బర్త్‌ డే.. ఆయన ఆశయం దిశగా దీపికా పదుకొణె! | Deepika Padukone announces badminton school on her Father birthday | Sakshi
Sakshi News home page

Deepika Padukone: తండ్రి బర్త్‌ డే.. ఆయన లక్ష్యం దిశగా దీపికా పదుకొణె!

Jun 10 2025 4:09 PM | Updated on Jun 10 2025 4:24 PM

Deepika Padukone announces badminton school on her  Father birthday

బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తన తండ్రికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తన తండ్రి బర్త్‌ డే సందర్భంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టినరోజు సందర్భంగా పదుకొణె స్కూల్ ఆఫ్‌ బ్యాడ్మింటన్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన  ఇన్‌స్టాగ్రామ్  ద్వారా పంచుకుంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజ  క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకొనేకు అంకితమిస్తున్నట్లు వెల్లడించింది.

దీపికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. "బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా.. ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించా. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆడితే కలిగే ఆనందం, క్రమశిక్షణ అందించాలని అనుకుంటున్నా. ఆరోగ్యకరమైన క్రీడ ద్వారా ప్రేరణ పొందిన తరాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాం. డాడీ, మీ గురించి బాగా తెలిసిన వారికి.. ఈ క్రీడ పట్ల మీకెంత మక్కువో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా తినడం, నిద్రపోవడం, బ్యాడ్మింటన్‌ ఆడడమే మీ ప్రపచం. అందుకే మీ ఇష్టాన్ని నిజం చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్‌! మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా" అంటూ పోస్ట్ చేసింది.

 కాగా.. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్‌ ఇప్పటికే పలు నగరాల్లో స్థాపించారు. దాదాపు ఇప్పటికే 75 కేంద్రాల్లో నెలకొల్పారు. కాగా.. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ ప్రపంచ నంబర్ వన్‌ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్‌లో ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీలో మెప్పించిన దీపికా.. ప్రస్తుతం అల్లు అర్జున్‌- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement