మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా.. ట్రైలర్‌ అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

Deadpool & Wolverine Trailer: మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా.. ట్రైలర్‌ అదుర్స్‌

Published Tue, Apr 23 2024 2:26 PM

Deadpool And Wolverine Trailer Out - Sakshi

మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.

ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement